మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 

Sri Shakambhari Panchakam – శ్రీ శాకంభరీ పంచకం


శ్రీవల్లభసోదరీ శ్రితజనశ్చిద్దాయినీ శ్రీమతీ
శ్రీకంఠార్ధశరీరగా శ్రుతిలసన్మాణిక్యతాటంకకా |
శ్రీచక్రాంతరవాసినీ శ్రుతిశిరః సిద్ధాంతమార్గప్రియా
శ్రీవాణీ గిరిజాత్మికా భగవతీ శాకంభరీ పాతు మామ్ || 1 ||

శాంతా శారదచంద్రసుందరముఖీ శాల్యన్నభోజ్యప్రియా
శాకైః పాలితవిష్టపా శతదృశా శాకోల్లసద్విగ్రహా |
శ్యామాంగీ శరణాగతార్తిశమనీ శక్రాదిభిః సంస్తుతా
శంకర్యష్టఫలప్రదా భగవతీ శాకంభరీ పాతు మామ్ || 2 ||

కంజాక్షీ కలశీ భవాదివినుతా కాత్యాయనీ కామదా
కల్యాణీ కమలాలయా కరకృతాంభోజాసిఖేటాభయా |
కాదంవాసవమోదినీ కుచలసత్కాశ్మీరజాలేపనా
కస్తూరీతిలకాంచితా భగవతీ శాకంభరీ పాతు మామ్ || 3 ||

భక్తానందవిధాయినీ భవభయప్రధ్వంసినీ భైరవీ
భస్మాలంకృతిభాసురా భువనభీకృద్దుర్గదర్పాపహా |
భూభృన్నాయకనందినీ భువనసూర్భాస్వత్పరః కోటిభా
భౌమానందవిహారిణీ భగవతీ శాకంభరీ పాతు మామ్ || 4 ||

రీతామ్నాయశిఖాసు రక్తదశనా రాజీవపత్రేక్షణా
రాకారాజకరావదాతహసితా రాకేందుబింబస్థితా |
రుద్రాణీ రజనీకరార్భకలసన్మౌలీ రజోరుపిణీ
రక్షః శిక్షణదీక్షితా భగవతీ శాకంభరీ పాతు మామ్ || 5 ||

శ్లోకానామిహ పంచకం పఠతి యః స్తోత్రాత్మకం శర్మదం
సర్వాపత్తివినాశకం ప్రతిదినం భక్త్యా త్రిసంధ్యం నరః |
ఆయుఃపూర్ణమపారమర్థమమలాం కీర్తిం ప్రజామక్షయాం
శాకంభర్యనుకంపయా స లభతే విద్యాం చ విశ్వార్థకామ్ || 6 ||

ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచితం శాకంభరీ పంచకమ్ ||

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.