మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 

Meenakshi Stotram  –  మీనాక్షీ స్తోత్రం


శ్రీవిద్యే శివవామభాగనిలయే శ్రీరాజరాజార్చితే
శ్రీనాథాదిగురుస్వరూపవిభవే చింతామణీపీఠికే |
శ్రీవాణీగిరిజానుతాంఘ్రికమలే శ్రీశాంభవి శ్రీశివే
మధ్యాహ్నే మలయధ్వజాధిపసుతే మాం పాహి మీనాంబికే || 1 ||

చక్రస్థేఽచపలే చరాచరజగన్నాథే జగత్పూజితే
ఆర్తాలీవరదే నతాభయకరే వక్షోజభారాన్వితే |
విద్యే వేదకలాపమౌళివిదితే విద్యుల్లతావిగ్రహే
మాతః పూర్ణసుధారసార్ద్రహృదయే మాం పాహి మీనాంబికే || 2 ||

కోటీరాంగదరత్నకుండలధరే కోదండబాణాంచితే
కోకాకారకుచద్వయోపరిలసత్ప్రాలంబహారాంచితే |
శింజన్నూపురపాదసారసమణీశ్రీపాదుకాలంకృతే
మద్దారిద్ర్యభుజంగగారుడఖగే మాం పాహి మీనాంబికే || 3 ||

బ్రహ్మేశాచ్యుతగీయమానచరితే ప్రేతాసనాంతస్థితే
పాశోదంకుశచాపబాణకలితే బాలేందుచూడాంచితే |
బాలే బాలకురంగలోలనయనే బాలార్కకోట్యుజ్జ్వలే
ముద్రారాధితదైవతే మునిసుతే మాం పాహి మీనాంబికే || 4 ||

గంధర్వామరయక్షపన్నగనుతే గంగాధరాలింగితే
గాయత్రీగరుడాసనే కమలజే సుశ్యామలే సుస్థితే |
ఖాతీతే ఖలదారుపావకశిఖే ఖద్యోతకోట్యుజ్జ్వలే
మంత్రారాధితదైవతే మునిసుతే మాం పాహీ మీనాంబికే || 5 ||

నాదే నారదతుంబురాద్యవినుతే నాదాంతనాదాత్మికే
నిత్యే నీలలతాత్మికే నిరుపమే నీవారశూకోపమే |
కాంతే కామకలే కదంబనిలయే కామేశ్వరాంకస్థితే
మద్విద్యే మదభీష్టకల్పలతికే మాం పాహి మీనాంబికే || 6 ||

వీణానాదనిమీలితార్ధనయనే విస్రస్తచూలీభరే
తాంబూలారుణపల్లవాధరయుతే తాటంకహారాన్వితే |
శ్యామే చంద్రకళావతంసకలితే కస్తూరికాఫాలికే
పూర్ణే పూర్ణకలాభిరామవదనే మాం పాహి మీనాంబికే || 7 ||

శబ్దబ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాఙ్మయీ
నిత్యానందమయీ నిరంజనమయీ తత్త్వంమయీ చిన్మయీ |
తత్త్వాతీతమయీ పరాత్పరమయీ మాయామయీ శ్రీమయీ
సర్వైశ్వర్యమయీ సదాశివమయీ మాం పాహి మీనాంబికే || 8 ||

ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ మీనాక్షీ స్తోత్రమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.