మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 

Navaratnamalika – నవరత్నమాలికా


హారనూపురకిరీటకుండలవిభూషితావయవశోభినీం
కారణేశవరమౌలికోటిపరికల్ప్యమానపదపీఠికామ్ |
కాలకాలఫణిపాశబాణధనురంకుశామరుణమేఖలాం
ఫాలభూతిలకలోచనాం మనసి భావయామి పరదేవతామ్ || 1 ||

గంధసారఘనసారచారునవనాగవల్లిరసవాసినీం
సాంధ్యరాగమధురాధరాభరణసుందరాననశుచిస్మితామ్ |
మంధరాయతవిలోచనామమలబాలచంద్రకృతశేఖరీం
ఇందిరారమణసోదరీం మనసి భావయామి పరదేవతామ్ || 2 ||

స్మేరచారుముఖమండలాం విమలగండలంబిమణిమండలాం
హారదామపరిశోభమానకుచభారభీరుతనుమధ్యమామ్ |
వీరగర్వహరనూపురాం వివిధకారణేశవరపీఠికాం
మారవైరిసహచారిణీం మనసి భావయామి పరదేవతామ్ || 3 ||

భూరిభారధరకుండలీంద్రమణిబద్ధభూవలయపీఠికాం
వారిరాశిమణిమేఖలావలయవహ్నిమండలశరీరిణీమ్ |
వారిసారవహకుండలాం గగనశేఖరీం చ పరమాత్మికాం
చారుచంద్రవిలోచనాం మనసి భావయామి పరదేవతామ్ || 4 ||

కుండలత్రివిధకోణమండలవిహారషడ్దలసముల్లస-
త్పుండరీకముఖభేదినీం చ ప్రచండభానుభాసముజ్జ్వలామ్ |
మండలేందుపరివాహితామృతతరంగిణీమరుణరూపిణీం
మండలాంతమణిదీపికాం మనసి భావయామి పరదేవతామ్ || 5 ||

వారణాననమయూరవాహముఖదాహవారణపయోధరాం
చారణాదిసురసుందరీచికురశేకరీకృతపదాంబుజామ్ |
కారణాధిపతిపంచకప్రకృతికారణప్రథమమాతృకాం
వారణాంతముఖపారణాం మనసి భావయామి పరదేవతామ్ || 6 ||

పద్మకాంతిపదపాణిపల్లవపయోధరాననసరోరుహాం
పద్మరాగమణిమేఖలావలయనీవిశోభితనితంబినీమ్ |
పద్మసంభవసదాశివాంతమయపంచరత్నపదపీఠికాం
పద్మినీం ప్రణవరూపిణీం మనసి భావయామి పరదేవతామ్ || 7 ||

ఆగమప్రణవపీఠికామమలవర్ణమంగళశరీరిణీం
ఆగమావయవశోభినీమఖిలవేదసారకృతశేఖరీమ్ |
మూలమంత్రముఖమండలాం ముదితనాదబిందునవయౌవనాం
మాతృకాం త్రిపురసుందరీం మనసి భావయామి పరదేవతామ్ || 8 ||

కాలికాతిమిరకుంతలాంతఘనభృంగమంగళవిరాజినీం
చూలికాశిఖరమాలికావలయమల్లికాసురభిసౌరభామ్ |
వాలికామధురగండమండలమనోహరాననసరోరుహాం
కాలికామఖిలనాయికాం మనసి భావయామి పరదేవతామ్ || 9 ||

నిత్యమేవ నియమేన జల్పతాం – భుక్తిముక్తిఫలదామభీష్టదామ్ |
శంకరేణ రచితాం సదా జపేన్నామరత్ననవరత్నమాలికామ్ || 10 ||

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.