మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Gauri Saptashloki stuti – శ్రీ గౌరీ సప్తశ్లోకీ స్తుతిః
కరోపాంతే కాంతే వితరణరవంతే విదధతీం
నవాం వీణాం శోణామభిరుచిభరేణాంకవదనాం |
సదా వందే మందేతరమతిరహం దేశికవశా-
త్కృపాలంబామంబాం కుసుమితకదంబాంకణగృహామ్ || 1 ||
శశిప్రఖ్యం ముఖ్యం కృతకమలసఖ్యం తవ ముఖం
సుధావాసం హాసం స్మితరుచిభిరాసన్న కుముదం |
కృపాపాత్రే నేత్రే దురితకరితోత్రేచ నమతాం
సదా లోకే లోకేశ్వరి విగతశోకేన మనసా || 2 ||
అపి వ్యాధా వాధావపి సతి సమాధాయ హృది తా
మనౌపమ్యాం రమ్యాం మునిభిరవగమ్యాం తవ కలాం,
నిజామాద్యాం విద్యాం నియతమనవద్యాం న కలయే
న మాతంగీమంగీకృతసరససంగీతరసికామ్ || 3 ||
స్ఫురద్రూపానీపావనిరుహసమీపాశ్రయపరా
సుధాధారాధారాధరరుచిరుదారా కరుణయా |
స్తుతి ప్రీతా గీతామునిభిరుపనీతా తవ కలా
త్రయీసీమా సా మామవతు సురసామాజికమతా || 4 ||
తులాకోటీకోటీ కిరణపరిపాటి దినకరం
నఖచ్ఛాయామాయా శశినళినదాయాదవిభవం |
పదం సేవే భావే తవ విపదభావే విలసితం
జగన్మాతః ప్రాతః కమలముఖి నాతః పరతరమ్ || 5 ||
కనత్ఫాలాం బాలాం లళితశుకలీలాంబుజకరాం
లసద్ధారాధారాం కచవిజితధారాధరరుచిం |
రమేంద్రాణీవాణీ లసదసితవేణీసుమపదాం
మహత్సీమాం శ్యామామరుణగిరివామాం భజ మతే || 6 ||
గజారణ్యే పుణ్యే శ్రితజనశరణ్యే భగవతీ
జపావర్ణాపర్ణాం తరళతరకర్ణాంతనయనా |
అనాద్యంతా శాంతాబుధజనసుసంతానలతికా
జగన్మాతా పూతా తుహినగిరిజాతా విజయతే || 7 ||
గౌర్యాస్సప్తస్తుతిం నిత్యం ప్రభాతే నియతః పఠేత్ |
తస్యసర్వాణి సిద్ధ్యన్తి వాంఛితాని న సంశయః || 8 ||
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.