మనకు గల అన్ని పురాణములలో, ఇతిహాసములలొ ముఖ్యమైనది మహాభారతం. తెలుగులో మన పెద్దలు తరచుగా అనే మాట " తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి".
మనకు తెలిసినంత వరకు భారతం 18 సంఖ్యకు ప్రాముఖ్యతను ఇచ్చినది. ఇందులో ఏది చూసినా 18. దీనిలోని పర్వములుకూడా 18. ఇప్పుడు వాటి పేర్లు వానిలోగల శ్లోకముల సంఖ్యలు తెలుసుకుందాం!
ఆదిపర్వం - 9984 శ్లోకములు,
సభాపర్వం - 4311 శ్లోకములు,
అరణ్య పర్వం - 13664 శ్లోకములు,
విరాటపర్వం - 3500 శ్లోకములు,
ఉద్యోగ పర్వం - 6998 శ్లోకములు,
భీష్మ పర్వం - 5884 శ్లోకములు,
ద్రోణ పర్వం - 10919 శ్లోకములు,
కర్ణ పర్వం - 4900 శ్లోకములు,
శల్య పర్వం - 3220 శ్లోకములు,
సౌప్తిక పర్వం - 2870 శ్లోకములు,
స్త్రీ పర్వం - 1775 శ్లోకములు,
శాంతి పర్వం - 14525 శ్లోకములు,
అనుశాసనిక పర్వం - 12000 శ్లోకములు,
అశ్వమేధ పర్వం - 4420 శ్లోకములు,
ఆశ్రమవాస పర్వం - 1106 శ్లోకములు,
మౌసల పర్వం - 300 శ్లోకములు,
మహా ప్రస్థాన పర్వం - 120 శ్లోకములు,
స్వర్గారోహణ పర్వం - 200 శ్లోకములు,
అన్ని కలిపితే మనకు మహాభారతం లో మొత్తం 1,00,696 శ్లోకములు ఉన్నాయి.
పద్యం ;
గీతాశ్రయోహం తిష్ఠామి
గీతా మే చోత్తమం గృహమ్,
గీతా జ్ఞాన ముపాశ్రిత్య
త్రీన్లోకాంపాలయామ్యహవ్'. ||
నేను గీతనాశ్రయించుకొని యున్నాను. గీతయే నాకుత్తమమగు నివాస మందిరము. మరియు గీతా జ్ఞానము నాశ్రయించియే మూడు లోకములను నేను పాలించుచున్నాను.